Posts

Showing posts from October, 2024

మూసీ సుందరీకరణ పై హైకోర్టుకు వెళ్తా : తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్

Image
 మూసీ సుందరీకరణ పై హైకోర్టుకు వెళ్తా   తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్  మూసి సుందరీకరణ పేరుతో జరుగుతున్న కూల్చివేతలపై తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ శనివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొంటూ.. మూసి సుందరీకరణ పేరుతో జరిగే కూల్చివేతల్లో రాష్ట్ర హైకోర్టు భవనం, పాత ఉస్మానియా ఆసుపత్రి భవనం, సాలార్జంగ్ మ్యూజియం, పేట్ల బురుజు ఆసుపత్రి, 'ఆది హిందూ భవన్', 'అఫ్జల్ గంజ్' బస్టాండ్, 'భూలక్ష్మీ దేవాలయం' 'సెంట్రల్ లైబ్రరీ' ఆఖరికి 'మహాత్మా గాంధీ స్మారక సమాధి శాంతివనం, లంగర్ హౌస్' కూడా మూసి రివర్ బెడ్ (ప్రస్తుత ప్రభుత్వ ప్రకారం) లోనే ఉన్నాయనీ.. అంతేకాదు ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీఆర్ నిర్మించిన 'ఇమ్లీబన్ బస్టాండ్- సిబిఎస్) అయితే మూసీ నదీ గర్భంలోనే ఉందనీ పేర్కొన్నారు. ఇవన్నీ కూలగొట్టి పేద, మధ్యతరగతి ఇండ్ల దగ్గరికి రావాలనీ బీఆరెస్ సీనియర్ నేత, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజావరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూసీ నిర్వాసితులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..

 మూసి నిర్వాసితులను ఆదుకునే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వారందరినీ ఆదుకుంటుందన్నారు. ఎవరినీ అనాదలను చేయబోమన్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు సీఎం. అంతేకాదు.. ఎవరైనా వచ్చి రెచ్చగొడితే వారి మాటలను నమ్మొదని, వారి ఫామ్ హౌజ్‌లను కాపాడుకోవడానికే డ్రామాలాడుతున్నారని సీఎం విమర్శించారు. శనివారం నాడు కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. మూసీ నిర్వాసితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మూసీ నిర్వాసితులు అధైర్యపడొద్దని.. ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. మూసీ బాధితులకు అండగా ఉన్నట్లు మాట్లాడే వారంతా పేదలకు ఏం చేద్దామో.. వారిని ఎలా ఆదుకుందామో చెప్పాలని కోరారు. ఇళ్లు ఇద్దామా.. డబ్బులు ఇద్దామా.. ప్రభుత్వ స్థలాలు ఇద్దామా.. అని విపక్ష నేతలను సీఎం ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని నీటి ప్రమాదం నుంచి కాపాడాలని.. ప్రజల మంచి కోసమే ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు సీఎం రేవంత్. మూసీ దగ్గర ఉన్న వాళ్లు...

హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల

 హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల  హైదరాబాద్, అక్టోబర్ 5: హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా)కు అధికారికంగా హైపవర్స్‌ వచ్చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హైడ్రా ఆర్డినెన్స్‌కు గర్నవర్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. హైడ్రా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ  ఆమోద ముద్ర వేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన గవర్నర్ శనివారం గెజిట్‌ను విడుదల చేశారు. రాష్ట్రంలోని చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను రంగంలోకి దింపింది. జూలై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేయగా.. అప్పటి నుంచి హైడ్రా దూసుకెళ్లింది. ఎఫ్టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది. అయితే ఈ కూల్చివేతలపై పలు చోట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించగా.. హైడ్రా చట్టబద్ధతపై కోర్టు కూడా ప్రశ్నించింది. జీవో 99‌పై స్టే ఇవ్వాలంటూ అనేక మంది హైకోర్టులో పిటిషన్‌లు వేశారు. ఈ క్రమంలో హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రభుత్వం ప...