మూసీ సుందరీకరణ పై హైకోర్టుకు వెళ్తా : తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్
మూసీ సుందరీకరణ పై హైకోర్టుకు వెళ్తా తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ మూసి సుందరీకరణ పేరుతో జరుగుతున్న కూల్చివేతలపై తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ శనివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొంటూ.. మూసి సుందరీకరణ పేరుతో జరిగే కూల్చివేతల్లో రాష్ట్ర హైకోర్టు భవనం, పాత ఉస్మానియా ఆసుపత్రి భవనం, సాలార్జంగ్ మ్యూజియం, పేట్ల బురుజు ఆసుపత్రి, 'ఆది హిందూ భవన్', 'అఫ్జల్ గంజ్' బస్టాండ్, 'భూలక్ష్మీ దేవాలయం' 'సెంట్రల్ లైబ్రరీ' ఆఖరికి 'మహాత్మా గాంధీ స్మారక సమాధి శాంతివనం, లంగర్ హౌస్' కూడా మూసి రివర్ బెడ్ (ప్రస్తుత ప్రభుత్వ ప్రకారం) లోనే ఉన్నాయనీ.. అంతేకాదు ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీఆర్ నిర్మించిన 'ఇమ్లీబన్ బస్టాండ్- సిబిఎస్) అయితే మూసీ నదీ గర్భంలోనే ఉందనీ పేర్కొన్నారు. ఇవన్నీ కూలగొట్టి పేద, మధ్యతరగతి ఇండ్ల దగ్గరికి రావాలనీ బీఆరెస్ సీనియర్ నేత, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజావరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.